కొనసాగిన ర్యాలీ.. లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
- వరుసగా ఐదో రోజు మార్కెట్లకు లాభాలు
- రేపో రేట్లలో మార్పు లేకపోవడం సానుకూలం
- 117.34 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
- 28.60 పాయింట్ల లాభంతో నిఫ్టీ
కేంద్ర బడ్జెట్ సమర్పించిన రోజు నుంచీ దేశీయ స్టాక్ మార్కెట్లలో కనపడుతున్న ర్యాలీ నేడు కూడా కొనసాగింది. రెపో రేట్లలో మార్పులు ఏమీ ఉండవంటూ ఈ రోజు రిజర్వ్ బ్యాంకు ప్రకటించడం సానుకూల ప్రభావాన్ని చూపింది. వివిధ స్టాకులలో కొనుగోళ్లు కనిపించాయి.
దీంతో వరుసగా ఇదో రోజు కూడా మన స్టాక్ మార్కెట్లు లాభాలలో ముగిశాయి. ఒకానొక సమయంలో 460 పాయింట్ల లాభం వరకు సెన్సెక్స్ వెళ్లినప్పటికీ, అనంతరం మదుపుదారులు లాభాల స్వీకరణకు దిగడంతో, చివరికి 117.34 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 50731.63 వద్ద క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 28.60 పాయింట్ల లాభంతో 14924.25 వద్ద ముగిసింది.
ఇక నేడు ఎస్బీఐ, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్స్, కోటక్ మహేంద్ర, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ తదితర షేర్లు లాభాలు గడించగా.. టీవీఎస్ మోటార్, ఏక్సిస్ బ్యాంక్, ఎల్ఐసీ హోసింగ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.