కాశీబుగ్గ ఎస్సై శిరీషకు ప్రశంసాపత్రం అందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్

  • యాచకుడి శవాన్ని మోసిన ఎస్సై శిరీష
  • మహిళా ఎస్సైకి ప్రజలు, మీడియా నీరాజనాలు
  • స్వయంగా బ్యాడ్జి తొడిగిన డీజీపీ సవాంగ్
  • ఇతర పోలీసులకు స్ఫూర్తి కలిగించావని అభినందనలు
మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా లేడీ ఎస్సై శిరీషనే దర్శనమిస్తోంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న శిరీష ఇటీవల ఓ యాచకుడి శవాన్ని స్వయంగా మోసుకురావడం సర్వత్రా అభినందనల వర్షం కురిపిస్తోంది. 13 ఏళ్ల ప్రాయంలోనే బాల్య వివాహం చేసుకుని నరకం చవిచూసిన శిరీష, ఆపై జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొని ఎస్సైగా ఉద్యోగం చేపట్టిన విషయం తెలుసుకున్న తర్వాత ప్రజల్లో ఆమెపై మరింత గౌరవం పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఎస్సై శిరీషను రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా అభినందించారు. తన కార్యాలయానికి శిరీషను ఆహ్వానించడమే కాదు, ఆమెకు ప్రశంసాపత్రం కూడా అందజేశారు. గౌరవ బ్యాడ్జిని కూడా తొడిగారు. ఇతర పోలీసులకు స్ఫూర్తిగా నిలిచావంటూ కొనియాడారు. ఈ కార్యక్రమానికి పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.


More Telugu News