శిరోముండనం బాధితుడు ప్ర‌సాద్‌ను కాకినాడ‌లో గుర్తించి తీసుకొచ్చిన పోలీసులు!

  • రెండు రోజుల క్రితం అదృశ్యం
  • పోలీసు స్టేష‌న్‌లో ఆయ‌న భార్య ఫిర్యాదు
  • కొంద‌రు మాటలతో వేధిస్తున్నారని ఇటీవ‌ల‌ చెప్పిన ప్ర‌సాద్
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలికి చెందిన  శిరోముండనం బాధితుడు ఇండుగమల్లి ప్రసాద్ అదృశ్య‌మైన‌ట్లు ఆయ‌న భార్య ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కోసం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించిన పోలీసులు కాకినాడలో ఆయ‌న ఉన్న‌ట్లు గుర్తించారు. అక్కడి నుంచి ప్రసాద్ ‌ను కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

గ‌త ఏడాది జులైలో ఇండుగమల్లి ప్రసాద్ అనే వ్య‌క్తికి పోలీసు స్టేషన్‌లో అప్పటి ఎస్సై ఫిరోజ్‌ శిరోముండనం చేయించిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే.  త‌న‌కు శిరోముండనం చేయ‌డం ప‌ట్ల కొంద‌రు మాటలతో వేధిస్తున్నారని ప్ర‌సాద్ కుటుంబ స‌భ్యుల‌తో చెబుతుండే వాడు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన‌ట్లు  ఆయ‌న భార్య చెప్పింది. సెల్‌ఫోన్‌, మోటార్‌ సైకిల్ ను ఇంటి వద్దనే వదిలి వెళ్లిపోయిన‌ ప్రసాద్ ఆచూకీ చివరికి లభించడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.  


More Telugu News