దీప్ సిద్ధూ ఎక్కడున్నాడు? ఆయనను ఎందుకు పట్టుకోవట్లేదు: సంజయ్ రౌత్
- ప్రభుత్వాన్ని నిలదీస్తే దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారు
- జాతీయ జెండాకు అవమానం జరిగింది
- ఇందుకు కారణమైన వారిని కేంద్ర ప్రభుత్వం వదిలేస్తోంది
- రైతులను అరెస్టు చేయడం సరికాదు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతోన్న రైతులపై పోలీసుల తీరు పట్ల శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వాన్ని నిలదీసే విపక్ష నేతలతో పాటు జర్నలిస్టులు, రైతులను కూడా కేంద్రం దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తోందని ఆయన విమర్శించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌ను ఎందుకు దేశద్రోహులంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని అవమానించడంపై దేశ ప్రజలు విచారం వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. ఈ ఘటనకు కారణమైన వారిని కేంద్ర ప్రభుత్వం వదిలేసి, రైతులను అరెస్టు చేయడం సరికాదని అన్నారు.
ఆ రోజు త్రివర్ణ పతాకాన్ని అవమానించిన దీప్ సిద్ధూ ఎక్కడున్నాడని, ఆయనను ఎందుకు పట్టుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆందోళనపై దుష్ప్రచారం చేయడం సరికాదని చెప్పారు. రైతుల ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. జనవరి 26 నుంచి చాలా మంది రైతులు అదృశ్యమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల ఉద్యమంపై బహుజన్ సమాజ్‌పార్టీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా కూడా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతులు ఢిల్లీలోకి రాకుండా సరిహద్దుల్లో రోడ్డుపై మేకులు ఏర్పాటు చేశారని, ఇటువంటి చర్యలు చైనా, పాకిస్థాన్ సరిహద్దులో చేయాల్సిందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. అలా చేస్తే దేశానికి మంచిదని తెలిపారు. రైతులను కేంద్ర ప్రభుత్వం శత్రువుల్లా చూస్తోందని, వారికి విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసిందని చెప్పారు. ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకు రాదా? అని నిలదీశారు.