కల నిజమైందంటున్న నిధి అగర్వాల్!

  • క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా సినిమా 
  • ఓ కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్
  • తనకిది గోల్డెన్ ఫిలిం అంటున్న ముద్దుగుమ్మ
  • ఇప్పటికే షూటింగులో పాల్గొంటున్న నిధి
కథానాయికగా టాలీవుడ్ లో మంచి స్థానం కోసం ప్రయత్నిస్తున్న యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇప్పుడు లక్కీ ఛాన్స్ కొట్టింది. ఇన్నాళ్లూ ఓ మాదిరి హీరోల సరసన సినిమాలు చేస్తూ వచ్చిన ఈ భామ.. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన కథానాయికగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా రూపొందుతున్న భారీ పిరీడ్ మూవీలో ఓ కథానాయికగా నిధి నటిస్తోంది. దీంతో ఈ చిన్నది ఇప్పుడు ఆనందంలో తేలియాడుతోంది.

"పవన్ కల్యాణ్ గారి సినిమాలో నటించడం చాలా ఆనందంగా వుంది. నా కల నిజమైనట్టు భావిస్తున్నాను. ఈ సినిమా నాకు తొమ్మిదోది అవుతుంది. ఇది నా కెరీర్లో గోల్డెన్ ఫిలింగా నిలిచిపోతుంది. పవన్ తో కలసి నటించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని మాత్రం అసలు అనుకోలేదు" అంటూ నిధి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఇక ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతోంది. నిధి ఇప్పటికే ఈ షూటింగులో పాల్గొంది కూడా. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో కథానాయికగా బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించే అవకాశం వుంది.  


More Telugu News