మరి కాస్త పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
- ఢిల్లీలో లీటరు పెట్రోలు, డీజిల్‌పై 30 పైసలు చొప్పున పెంపు
- లీటరు పెట్రోలు ధర రూ.86.95
- హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ.90.42
భారత్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు మరింత పెరిగాయి. ప్రభుత్వరంగ ఇంధన సంస్థలు ఈ రోజు విడుదల చేసిన నోటిపికేషన్ ప్రకారం... పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 37 పైసల చొప్పున పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు, డీజిల్‌పై 30 పైసలు చొప్పున పెరగడంతో లీటరు పెట్రోలు ధర రూ.86.95కు చేరింది. డీజిల్ ధర రూ.77.13కి పెరిగింది.
అలాగే, ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.93.49, డీజిల్ ధర 83.99కు పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.90.10 నుంచి రూ.90.42కి పెరిగింది. అలాగే, డీజిల్ ధర లీటరుకి రూ.83.81 నుంచి రూ.84.14కి పెరిగింది. విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ,93.08, డీజిల్ ధర రూ.86.31గా ఉంది.