కరోనా కొత్త రకాలు వేల సంఖ్యలో ఉన్నాయి... బ్రిటన్ మంత్రి వెల్లడి
- ఉత్పరివర్తనాలకు లోనైన కరోనా వైరస్
- బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కొత్త స్ట్రెయిన్ల వ్యాప్తి
- కరోనా కొత్త రకాలు 4 వేల వరకు ఉన్నాయన్న బ్రిటన్ మంత్రి
- వాటిలో ప్రభావం చూపేవి కొన్నే అని మెడికల్ జర్నల్ వెల్లడి
కరోనా మహమ్మారి జన్యు ఉత్పరివర్తనాలకు లోనై కొత్త రకాలుగా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. ఇటీవల బ్రిటన్ లోనూ, దక్షిణాఫ్రికాలోనూ కరోనా కొత్త స్ట్రెయిన్లు వెలుగుచూశాయి. ఇవి అమితవేగంతో వ్యాప్తి చెందుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే, కరోనా కొత్త రకాలు ఒకటి కాదు, రెండు కాదు... 4 వేల రకాలు ఉన్నాయని తాజాగా బ్రిటన్ చేసిన ప్రకటన ఆ ఆందోళనను మరింత అధికం చేస్తోంది. ఇతర దేశాలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా వైరస్ భూతం రూపు మార్చుకుని వేల రకాలుగా మారిందని బ్రిటన్ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా 4 వేల వరకు స్ట్రెయిన్లు ఉన్నాయని బ్రిటన్ మంత్రి నదీమ్ జహానీ పేర్కొన్నారు. దీనిపై బ్రిటన్ మెడికల్ జర్నల్ స్పందించింది. మంత్రి చెప్పినట్టు వేల రకాలు వ్యాప్తి చెందుతున్నా, వాటిలో తీవ్ర ప్రభావం చూపించే స్ట్రెయిన్లు కొన్ని మాత్రమేనని అభిప్రాయపడింది. వాటిలో చాలా రకాలు ఏమంత ప్రభావం చూపేవి కావని స్పష్టం చేసింది.