వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెంపు.. నేటి నుంచే అమలు
- రాయితీ సిలిండర్‌పై రూ.25 పెంపు
- వాణిజ్య సిలిండర్‌పై రూ.184
- ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.719
- హైదరాబాద్‌లో నిన్నటివరకు ధర రూ.746.50.. ఇప్పుడు రూ.771.50
రాయితీ వంట గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. నేటి నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. రాయితీ సిలిండర్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.184 పెంచారు.
దీంతో నిన్నటి వరకు ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.664 ఉండగా.. ఇప్పుడు రూ.719కి చేరింది. హైదరాబాద్‌లో ఇప్పటివరకు రూ.746.50గా ఉన్న ఆ సిలిండర్ ధర రూ.771.50కు చేరింది. కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735కగా ఉంది. అలాగే, లక్నోలో రూ.757, నోయిడాలో రూ.717, కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719కి పెరిగింది. ఈ ఏడాదిలో సిలిండర్ ధరలు పెరగడం ఇదే తొలిసారి.