ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని శ్రీవారిని ప్రార్థించాను: తిరుమలలో మీడియాతో నిమ్మగడ్డ
- శ్రీవారిని దర్శించుకున్న నిమ్మగడ్డ, జీవీఎల్
- శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసిన అర్చకులు
- అనంతరం మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ
ఈ రోజు తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత శ్రీవారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. అనంతరం నిమ్మగడ్డ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.
కాగా, ఈ రోజు ఉదయం బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... భారత్ ఆర్థిక ప్రగతి సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో నిర్మిస్తోన్న అయోధ్య రామాలయ నిర్మాణానికి ప్రజలు విరాళాలిస్తున్నారని చెప్పారు. హిందువులకు ఆ రామాలయం ఆరాధ్య దేవాలయంగా విరాజిల్లుతుందని చెప్పారు.