రైతుల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల ప్రాంతంలో ఇనుప మేకులను తొల‌గిస్తోన్న పోలీసులు

  • విమ‌ర్శ‌ల జ‌ల్లు కుర‌వ‌డంతో వెన‌క్కి త‌గ్గిన కేంద్రం
  • రైతుల చుట్టూ ఏర్పాటు చేసిన‌ ముళ్ల కంచెల తొలగింపు
  • కొన్ని మేకులను స్వ‌యంగా తీసిన‌ రైతులు
కొత్త వ్యవసాయ చట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌ పోరాడుతోన్న రైతులు.. అక్క‌డి నుంచి ముందుకు వెళ్ల‌కుండా పోలీసులు ఇనుప మేకులు, కందకాలు, ముళ్ల కంచెలు, కాంక్రీట్‌ దిమ్మెల వంటివి ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర స‌ర్కారుపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిసింది. అంత‌ర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది.

దీంతో దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి ఆలోచించి, సరిహద్దుల్లో అమర్చిన ఇనుప మేకులు, ముళ్ల కంచెలను తొలగించే ప్రయత్నం చేస్తోంది. వాటిల్లో కొన్నింటిని పోలీసులు తీసేసిన‌ట్లు తెలిసింది. కాగా, రైతులు కూడా కొన్నింటిని తొలగించారు.

కాగా,  ఢిల్లీ స‌రిహ‌ద్దుల వ‌ద్ద నిర‌స‌న‌లు కొన‌సాగిస్తోన్న రైతుల‌కు సంఘీభావం తెలిపేందుకు గాజీపూర్ స‌రిహ‌ద్దు వ‌ద్ద‌కు విప‌క్ష ఎంపీల బృందం చేరుకోగా వారిని పోలీసులు అడ్డుకున్న విష‌యం తెలిసిందే. గాజీపూర్ దాటి వెళ్లేందుకు వారికి అనుమ‌తి లేదని చెప్పడంతో వారంతా అక్క‌డి నుంచి వెన‌క్కి బ‌య‌ల్దేరారు. అంత‌కు ముందు వారు పోలీసుల‌తో వాగ్వివాదానికి దిగారు. మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.


More Telugu News