ఇదేనా పరిపాలన..? ఇదేనా అచ్చే దిన్?: బుచ్చయ్య చౌదరి విమర్శలు
- ప్రైవేటీకరణ పేరుతో ఉక్కు పరిశ్రమను నొక్కిన కేంద్రం
- చేయూతను ఇవ్వాల్సింది పోయి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇస్తున్నారు
- మొన్న బీఎస్ఎన్ఎల్, నిన్న ఎల్ఐసీ, నేడు స్టీల్ ప్లాంట్
విశాఖ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనికి గత నెల జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రశ్నించలేకపోతోందని చెప్పారు. దీనిపై టీడీపీ నేతల గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు.
'వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుమతి ఇచ్చిన కేంద్రం. దీని పైన నోరు విప్పని వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్. ప్రైవేటీకరణ పేరుతో ఉక్కు పరిశ్రమను నొక్కిన కేంద్రం' అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
'కార్మిక ఉక్కు సంకల్ప శక్తితో ఎదిగిన ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం చేయూతను ఇవ్వాల్సింది పోయి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కి ఇవ్వడం ఆక్షేపణీయం. మొన్న బీఎస్ఎన్ఎల్, నిన్న ఎల్ఐసీ, నేడు స్టీల్ ప్లాంట్... ఇదేనా పరిపాలన..? ఇదేనా అచ్చే దిన్.. నరేంద్ర మోదీ?' అని గోరంట్ల బుచ్చయ్చ చౌదరి ప్రశ్నించారు.