ఖైదీ నంబర్ 8775గా అచ్చెన్నాయుడు!
- ప్రస్తుతం అంపోలు జిల్లా జైల్లో అచ్చెన్నాయుడు
- తొలి రోజు మూడు చపాతీలు, చిక్కుడు కూర
- తన వద్దకు ఎవరినీ పంపవద్దన్న అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామంలో కింజారపు అప్పన్నపై దాడికి దిగిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించగా, గార మండలం, అంపోలులోని జిల్లా జైలుకు ఆయన్ను తరలించారు. జైలు అధికారులు ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 8775ను కేటాయించారు. మంగళవారం సాయంత్రం తరువాత జైలుకు చేరుకున్న ఆయన, ఆ రోజున మూడు చపాతీలు, చిక్కుడు కాయల కూర తిని, రాత్రి 9.30 గంటలకు నిద్రపోయారని జైలు అధికారులు తెలిపారు.
ఇక నిన్న ఉదయం 5.30 గంటల సమయంలో నిద్రలేచి, టీ తాగారని, జైలు సిబ్బంది తెచ్చిన దినపత్రికలు చదివి, ఉదయం అల్పాహారంగా పొంగలి తిన్నారని అన్నారు. తాను ఎవరినీ కలవబోనని జైలు సిబ్బందికి అచ్చెన్నాయుడు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే, నేడు లేదా రేపు లోకేశ్ సహా మరికొందరు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడిని కలవవచ్చని పోలీసులకు సమాచారం అందింది.