భారత్ నుంచే వచ్చే ప్రయాణికులపై సౌదీ అరేబియా నిషేధాజ్ఞలు!
- ఇండియా సహా 20 దేశాలపై నిషేధం
- తమ పౌరులకు వర్తించబోదని వెల్లడి
- కరోనా నియంత్రణకేనన్న సౌదీ
దేశంలో నానాటికీ కేసులు పెరుగుతున్న వేళ, సౌదీ అరేబియా కఠిన నిర్ణయాలు తీసుకుంది. 20 దేశాల నుంచి తమ దేశంలోకి ప్రయాణికులను కాలు పెట్టనివ్వబోమని స్పష్టం చేసింది. ఈ జాబితాలో ఇండియా కూడా ఉంది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకే ట్రావెల్ బ్యాన్ విధించినట్టు అధికారులు వెల్లడించారు.
ఇదే సమయంలో ఈ 20 దేశాల్లో ఉంటున్న సౌదీ పౌరులు, ప్రభుత్వ అధికారులపై మాత్రం నిషేధం ఉండదని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకు విధించిన నిబంధనలను పాటించకుంటే చర్యలు తీసుకుంటామని ఆ దేశ ఆరోగ్య మంత్రి తాఫిక్ అల్ రబియా హెచ్చరించారు.