ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
- జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు
- ఈ ఏడాది 7 పేపర్లు మాత్రమే
- సైన్స్ సబ్జెక్టుకు మాత్రం రెండు పేపర్లు
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఏడాది ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. సైన్సు సబ్జెక్టుకు మాత్రం రెండు పేపర్లు ఉంటాయి. సైన్సులో ఒక్కో పేపరుకు 50 మార్కులు కేటాయించారు.
మరోవైపు పదో తరగతి విద్యార్థులకు జూన్ ఐదో తేదీ వరకు క్లాసులు జరగనున్నాయి. మే 3 నుంచి 10 వరకు ఇతర తరగతులకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల అనంతరం సెలవుల తర్వాత జులై 21 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.