మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణంలో జాప్యం.. ఇసుకే కారణమన్న కేంద్రమంత్రి
- సుజనా చౌదరి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం
- ప్రస్తుతం పనులు పురోగతిలోనే ఉన్నాయన్న మంత్రి
- రాష్ట్ర ప్రభుత్వ పరంగా కొంత ఆలస్యం జరిగిందన్నచౌబే
గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణంలో జాప్యానికి ఇసుక కొరతే కారణమని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే పార్లమెంటుకు తెలిపారు. ఎయిమ్స్ నిర్మాణంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఆసుపత్రి నిర్మాణానికి తొలుత ఇసుక దొరక్క నిర్మాణంలో కొంత జాప్యం జరిగిందని, అయితే ప్రస్తుతం పనులు పురోగతిలోనే ఉన్నాయని తెలిపారు. డ్రైనేజీ, రహదారి నిర్మాణంతోపాటు ఎన్‌డీఆర్ఎఫ్ క్యాంపస్‌ను మార్చడం వంటి పనుల్లో రాష్ట్రప్రభుత్వ పరంగా కొంత ఆలస్యం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. దీనికితోడు కరోనా వైరస్ లాక్‌డౌన్ ప్రభావం కూడా నిర్మాణంపై ప్రభావం చూపిందని చౌబే వివరించారు.