ఇండియా సిరీస్ గెలవగానే కళ్లు చెమ్మగిల్లాయి: వీవీఎస్ లక్ష్మణ్

  • గాబాలో ఇండియా గెలవగానే భావోద్వేగానికి గురయ్యాను
  • ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై గెలవడం నా కల
  • 2011లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా కన్నీళ్లు వచ్చాయి
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుని అబ్బుర పరిచిన సంగతి తెలిసిందే. 32 ఏళ్లుగా ఓటమే ఎరుగని గాబా స్టేడియంలో టెస్టును గెలిచిన యువ భారత ఆటగాళ్లు త్రివర్ణ పతాకం సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. ఈ విజయంపై టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గాబాలో మ్యాచ్ గెలవగానే తాను తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని, తన కళ్లు చెమ్మగిల్లాయని అన్నారు. ఏడ్చేశానని తెలిపారు. చివరి రోజు మ్యాచ్ ను కుటుంబంతో కలిసి తాను చూశానని చెప్పారు.

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై గెలవడం తన కల అని లక్ష్మణ్ అన్నారు. తన కలను యువ ఆటగాళ్లు నెరవేర్చడం గర్వంగా అనిపించిందని చెప్పారు. ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి అని అన్నారు. తాను తన జీవితంలో కేవలం రెండు సార్లు మాత్రమే కంటతడి పెట్టుకున్నానని చెప్పారు. మన దేశం 2011లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా కన్నీళ్లు వచ్చాయని అన్నారు. అప్పుడు వరల్డ్ కప్ గెలిచిన ఆటగాళ్లందరితో కలిసి తాను ఆడానని చెప్పారు. వాళ్లంతా ప్రపంచ కప్ ను గెలవాలనే కలను సాకారం చేసుకోవడం చూసి భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు.


More Telugu News