ప్రపంచ రికార్డుకు మరో సెంచరీ దూరంలో కోహ్లీ

  • అంతర్జాతీయ క్రికెట్లో 41 సెంచరీలు చేసిన కెప్టెన్లుగా కోహ్లీ, పాంటింగ్
  • మరో సెంచరీ చేస్తే 42 సెంచరీలతో తొలి స్థానం
  • ఇంగ్లండ్ సిరీస్ లో ఈ ఫీట్ సాధించాలనే పట్టుదలతో కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరో ప్రపంచ రికార్డుకు ఒక అడుగు దూరంలో ఉన్నారు. మరో సెంచరీ చేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్ గా చరిత్ర పుటల్లోకి కోహ్లీ ఎక్కుతాడు.

 ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ తో కలసి కోహ్లీ ఇప్పుడు 41 సెంచరీలతో తొలి స్థానాన్ని పంచుకుంటున్నాడు. మరో సెంచరీ సాధిస్తే ప్రపంచంలో అత్యధిక సెంచరీలు (42) చేసిన క్రికెట్ కెప్టెన్ గా అవతరిస్తాడు. ఈ అధ్బుతమైన ఫీట్ ను త్వరలో జరగనున్న ఇంగ్లండ్ సిరీస్ లో సాధించాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు. కోహ్లీ ప్రపంచ క్రికెట్ ను చూసేందుకు భారత క్రికెట్ అభిమనులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు 324 మ్యాచుల్లో రిక్కీ పాంటింగ్ 41 సెంచరీలను సాధించగా... కోహ్లీ కేవలం 188 మ్యాచుల్లోనే ఆ ఘనత సాధించాడు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికాకు చెందిన గ్రేమ్ స్మిత్ (33), ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ (20), మైఖేల్ క్లార్క్ (19), వెస్టిండీస్ కు చెందిన బ్రియాన్ లారా (19) ఉన్నారు.


More Telugu News