శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
- రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది
- మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయి
- శ్రీనివాసరెడ్డిని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి
రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. మహిళల తాళిబొట్లు తెంచేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు 13 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని అన్నారు. గొల్లలగుంట శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఈ హత్యకు కారణమైన ముగ్గుర్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మృతుడు శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని నారా లోకేశ్ ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపించారని నారా లోకేశ్ మండిపడ్డారు. పట్టాభిపై దాడి చేశారని దుయ్యబట్టారు. ఈ పాపాలన్నీ జగన్ కు అంటుకుంటాయని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న పోరాటం టీడీపీకి, వైసీపీకి మధ్య జరుగుతోంది కాదని... ఇది అంబేద్కర్ రాజ్యాంగానికి, రాజారెడ్డి రాజ్యాంగానికి మధ్య జరుగుతున్నదని చెప్పారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ వైసీపీ కండువా కప్పుకున్నారని విమర్శించారు.