తొలిసారిగా మెట్రోరైలు ద్వారా గుండె తరలింపు
- హైదరాబాదులో ఘటన
- నర్సిరెడ్డి అనే రైతు బ్రెయిన్ డెడ్
- గుండెను దానం చేసిన కుటుంబ సభ్యులు
- అపోలో ఆసుపత్రి రోగికి అమర్చాలని నిర్ణయం
- గ్రీన్ చానల్ ద్వారా గుండె తరలింపు
ఇటీవల కాలంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు సేకరించి, అవసరమైన వారికి అమర్చడం తరచుగా జరుగుతోంది. అయితే, ఈ అవయవాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చాలా తక్కువ సమయంలోనే తరలించాల్సి ఉంటుంది. అందుకోసం గ్రీన్ చానల్ విధానం అమలు చేస్తున్నారు. గ్రీన్ చానల్ విధానం అంటే... అవయవాలు తరలించే వాహనం ఏ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ఆ వాహనాలు ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ను అత్యవసర ప్రాతిపదికన నిలిపివేయడం జరుగుతుంది. దాంతో ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి.
కాగా, గ్రీన్ చానల్ విధానంలో తొలిసారిగా అవయవాల తరలింపుకు మెట్రో రైలును వినియోగించారు. అది కూడా హైదరాబాదులోనే జరిగింది. నల్గొండ జిల్లా రైతు నర్సిరెడ్డి (45) బ్రెయిన్ డెడ్ అయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన గుండెను దానం చేశారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఈ గుండెను మరొకరికి అమర్చాలని నిర్ణయించారు.
దాంతో నర్సిరెడ్డి దేహం నుంచి సేకరించిన గుండెను తొలుత ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి నాగోల్ వరకు రోడ్డు మార్గంలో తరలించారు. అక్కడి ఉంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు మెట్రోరైలులో తీసుకెళ్లారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి అపోలో ఆసుపత్రి వరకు మళ్లీ రోడ్డు మార్గంలో తరలించారు. ఈ గుండెను ఓ రోగికి అమర్చనున్నారు.