ప్రభాస్ 'ఆదిపురుష్' రెగ్యులర్ షూటింగ్ ఆరంభం
- ఇప్పటికే 'సలార్' షూటింగులో ప్రభాస్
- ముంబైలో 'ఆదిపురుష్' షూటింగ్ మొదలు
- రామాయణం ఆధారంగా రూపొందే సినిమా
- సీతగా కథానాయిక పాత్రలో కృతి సనన్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గతంలోలా కాకుండా ఇప్పుడు స్పీడు బాగా పెంచేశాడు. ఒక సినిమా తర్వాత మరో సినిమా అన్నట్టు కాకుండా.. ఒకేసారి మూడు సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. వీటిలో 'సలార్' సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ రామగుండం సమీపంలోని కోల్ మైన్స్ ఏరియాలో జరుగుతోంది. ప్రభాస్, కొంతమంది ఫైటర్లపై యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.
మరోపక్క, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ కూడా ఈ రోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థతో పాటు ప్రభాస్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 'ఆదిపురుష్ ఆరంభ్' అనే పోస్టర్ని కూడా పోస్ట్ చేశాడు.
పురాణగాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా.. విలన్ లంకేశ్ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. సీత పాత్రలో కథానాయికగా కృతి సనన్ నటిస్తుందని అంటున్నారు. ప్రధాన భారతీయ భాషలన్నింటిలోనూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేసే ప్లానింగ్ చేస్తున్నారు.
ఇదిలావుంచితే, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించే మరో సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్నది త్వరలో తెలుస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మించే ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుండగా.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు.