డేట్ ఫిక్స్ చేసుకున్న సాయితేజ్ 'రిపబ్లిక్'!
- దేవ కట్టా దర్శకత్వంలో చిత్రం
- జూన్ 4న విడుదల
- ప్రకటించిన నిర్మాతలు
దేవ కట్టా దర్శకత్వంలో మెగా హీరో సాయితేజ్ నటిస్తున్న 'రిపబ్లిక్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు భగవాన్, పుల్లారావులు ఓ ప్రకటన చేశారు. సినిమా షూటింగ్ సాగుతోందని పేర్కొన్న వారు, ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు ఫ్యాన్స్ నుంచి ఎంతో స్పందన వచ్చిందని తెలిపారు. సినిమా నిర్మాణంలో ఏ విధమైన రాజీ పడడం లేదని చెప్పారు. కాగా, ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు కూడా నటిస్తున్నారు. 'రిపబ్లిక్'కు మణిశర్మ స్వరాలను సమకూరుస్తున్నారు.