భారత్-ఇంగ్లాండ్ తొలిటెస్టుకు 50 శాతం ప్రేక్షకులకు అనుమతి!

  • ఫిబ్రవరి 5 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం
  • ఈ నెల 13 నుంచి రెండో టెస్టు
  • క్రీడావేదికలకు వీక్షకులను అనుమతించిన కేంద్రం
  • సమయం లేకపోవడంతో వీక్షకుల్లేకుండానే తొలి టెస్టు
చెన్నైలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండు టెస్టులు జరగనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ టెస్టు సిరీస్ కు ప్రేక్షకులను అనుమతించడంపై ఇప్పటివరకు అనిశ్చితి నెలకొంది. అయితే, క్రీడా వేదికలకు వీక్షకులను అనుమతిస్తూ తాజా మార్గదర్శకాలు విడుదలైన నేపథ్యంలో, బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ సంఘం వర్గాల మధ్య చర్చలు జరిగాయి. రెండో టెస్టుకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు నిర్ణయించాయి.  దీనిపై తమిళనాడు క్రికెట్ సంఘం అధికారి మాట్లాడుతూ, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ 50 శాతం ప్రేక్షకులతో టీమిండియా-ఇంగ్లాండ్ రెండో టెస్టు జరిపేందుకు నిర్ణయించామని తెలిపారు.

కాగా, తొలి టెస్టు ఈ నెల 5న ప్రారంభం కానుంది.  తొలి టెస్టుకు టికెట్లు అమ్మేందుకు సమయం లేకపోవడంతో, ప్రేక్షకులు లేకుండానే జరపాలని నిర్ణయించారు. రెండో మ్యాచ్ ఈ నెల 13 నుంచి జరగనుంది. ఈ నాలుగు టెస్టుల సిరీస్ లో మిగిలిన రెండు టెస్టులు అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి.


More Telugu News