టీడీపీపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన మల్లాది విష్ణు
- పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోంది
- నిమ్మాడలో అచ్చెన్నాయుడు దుర్భాషలాడారు
- టీడీపీ మేనిఫెస్టోపై నిమ్మగడ్డ ఎందుకు స్పందించలేదు
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిమ్మాడలో నిన్న నామినేషన్ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, దౌర్జన్య పరిస్థితులపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు.
ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని టీడీపీ నాశనం చేస్తోందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ మేనిఫెస్టోపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేవలం ఒక నోటీసు మాత్రమే ఇచ్చి వదిలేశారని అన్నారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు దుర్భాషలాడారని చెప్పారు. శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఘటనలపై ఫిర్యాదు చేశామని తెలిపారు.