బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారు: గల్లా జయదేవ్

  • కేంద్ర వార్షిక బడ్జెట్ పై గల్లా జయదేవ్ స్పందన
  • కేంద్ర బడ్జెట్ లో మంచి ప్రొవిజన్స్ ఉన్నాయని వెల్లడి
  • కానీ రాష్ట్రానికి ఒక్క ప్రతిపాదన కూడా లేదని విమర్శలు
  • టీడీపీ హయాంలో రాష్ట్ర హక్కుల కోసం పోరాడామని వివరణ
కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రకటనపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. కేంద్ర బడ్జెట్ లో మంచి ప్రొవిజన్స్ ఉన్నాయని, కానీ రాష్ట్రానికి వచ్చేసరికి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందని అన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్ర హక్కుల కోసం అన్ని విధాలుగా పోరాడామని అన్నారు. వైసీపీ నుంచి 21 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారని విమర్శించారు. బడ్జెట్ లో రాష్ట్రం గురించి ఒక్క ప్రతిపాదన కూడా లేదని అన్నారు. బడ్జెట్ లో విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు అంశాల ప్రస్తావనే లేదని తెలిపారు.


More Telugu News