కేంద్ర బడ్జెట్ పై రాహుల్ గాంధీ స్పందన
- ఇవాళ బడ్జెట్ ప్రకటన
- ప్రజలకిచ్చిన హామీ విస్మరించారన్న రాహుల్
- దేశ సంపదను ఆశ్రిత పెట్టుబడిదారుల పరం చేస్తున్నారని ఆగ్రహం
- రాహుల్ మీమ్స్ తో నెటిజన్ల సందడి
కేంద్రం ఇవాళ ప్రకటించిన వార్షిక బడ్జెట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల ఖాతాల్లో డబ్బు వేస్తామన్న హామీని మర్చిపోయారని మోదీ సర్కారుపై విమర్శలు చేశారు. ప్రజలను విస్మరించిన మోదీ సర్కారు దేశ సంపదను ఆశ్రిత పెట్టుబడిదారుల పరం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
కాగా, పార్లమెంటులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ ఎంతో విసుగుచెందినట్టుగా హావభావాలు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో నెటిజన్లు మీమ్స్ రూపొందించారు. బడ్జెట్ నేపథ్యంలో నెట్టింట ఇవి బాగా సందడి చేస్తున్నాయి. బయాలజీ క్లాసులో హుషారుగా ఉండే రాహుల్ గాంధీ, మ్యాథ్స్ క్లాసులో ఎలా బోర్ ఫీలవుతున్నాడో చూడండి అంటూ ఈ మీమ్స్ సందడి చేస్తున్నాయి.