అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా లేదూ?: విజయసాయిరెడ్డి

  • నాలుగు సీట్లు కూడా గెలవలేమని పచ్చ పార్టీ ఫిక్సయింది
  • నిమ్మాడ అంటే చంద్రబాబు నీకు రాసిచ్చిన దివాణమా అచ్చెన్నా?
  • మీరు ఆదేశించిన వ్యక్తి తప్ప మరొకరు సర్పంచ్ గా నామినేషన్ వేయకూడదా?  
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడులపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 ప్రజా మద్దతుతో నాలుగు సీట్లు కూడా గెలవలేమని పచ్చ పార్టీ ఫిక్సయిందని ఆయన అన్నారు. అందుకే నిమ్మగడ్డ యాప్ అని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ యాప్ ఉండగా ఈ సీక్రెట్ యాప్ ఎందుకని ప్రశ్నించారు. ఈ యాప్ కంట్రోల్ రూమ్ ను టీడీపీ కార్యాలయంలో పెట్టారా? అని ప్రశ్నించారు. 'చంద్రబాబును, చినబాబును జాకీలేసినా నీవు లేపలేవు నిమ్మగడ్డా' అంటూ ఎస్ఈసీపై కామెంట్ చేశారు.

నిమ్మాడ అంటే చంద్రబాబు నీకు రాసిచ్చిన దివాణమా అచ్చెన్నా? అని విజయసాయి ప్రశ్నించారు. మీరు ఆదేశించిన వ్యక్తి తప్ప మరొకరు సర్పంచ్ గా నామినేషన్ వేయకూడదా? అని నిలదీశారు. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా లేదూ? అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యలు చేశారు.


More Telugu News