కేంద్ర బడ్జెట్ హైలైట్స్: ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ రవాణా కారిడార్ ఏర్పాటు
- డిస్కమ్ లకు రూ. 3,05,984 కోట్ల సాయం
- రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ. 1,01,055 కోట్లు
- చెన్నై, విశాఖల్లో మేజర్ హార్బర్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో 2021-22 ఆర్థిక బడ్జెన్ ను ప్రవేశపెడుతున్నారు. కరోనా తర్వాత దేశ ఆర్థిక వృద్ధిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉంది.
బడ్జెట్ హైలైట్స్:
బడ్జెట్ హైలైట్స్:
- ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 20 వేల కోట్లు
- రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ. 2 లక్షల కోట్లు
- విద్యుత్ పంపిణీ రంగంలో మరిన్ని పంపిణీ వ్యవస్థలు
- డిస్కమ్ లకు రూ. 3,05,984 కోట్ల సాయం
- హైడ్రోజన్ ఎనర్జీపై దృష్టి సారించనున్నాం
- ఇండియన్ షిప్పింగ్ కంపెనీకి రూ. 1,624 కోట్లు
- నౌకల రీసైక్లింగ్ సామర్థ్యం పెంపు
- బీమా రంగంలో ఎఫ్డీఐల శాతం 49 నుంచి 74 శాతానికి పెంపు
- త్వరలోనే ఎల్ఐసీ ఐపీఓ
- పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు అదనంగా రూ. 20 వేల కోట్ల సాయం
- 2022 నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు
- ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ రవాణా కారిడార్ ఏర్పాటు
- రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ. 1,01,055 కోట్లు
- 2023 నాటికి రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తి
- దేశ వ్యాప్తంగా విశాఖ సహా ఐదు చోట్ల ఆధునిక ఫిషింగ్ హార్బర్లు
- చెన్నై, విశాఖల్లో మేజర్ హార్బర్లు
- పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్ల ఆదాయం
- మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు. ఇక నుంచి బ్యాంకుల ఎన్పీఏలను నిర్వహించనున్న బ్యాడ్ బ్యాంక్.
- వ్యవసాయ రంగానికి రూ. 75,100 కోట్లు
- వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 16.50 లక్షల కోట్లు
- రూ. 40 వేల కోట్లతో గ్రామీణ మౌలిక వసతులు
- వన్ నేషన్-వన్ రేషన్ తో 69 కోట్ల మందికి లబ్ధి
- మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు రూ. 15,700 కోట్లు
- దేశ వ్యాప్తంగా 15 వేల ఆదర్శ పాఠశాలలు, 100 సైనిక్ స్కూళ్లు.