బడ్జెట్ ట్యాబ్ తో రాష్ట్రపతిని కలిసి, పార్లమెంట్ కు చేరుకున్న నిర్మలా సీతారామన్!
- దేశ చరిత్రలో తొలిసారి కాగిత రహిత బడ్జెట్
- తన టీమ్ తో కలిసి రాష్ట్రపతితో భేటీ
- బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్
భారత చరిత్రలో తొలిసారిగా కాగిత రహిత బడ్జెట్ నేడు పార్లమెంట్ ముందుకు రానుండగా, ఓ ట్యాబ్ లో తన బడ్జెట్ ప్రతిపాదనలను ఉంచుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఓ కాపీని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అందించారు. ఈ ఉదయం రాష్ట్రపతి నివాసానికి తన టీమ్ తో కలిసి ఆమె వెళ్లారు. దాదాపు పావుగంట సేపు రాష్ట్రపతితో భేటీ అయి, బడ్జెట్ విశేషాలను పంచుకుని, అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్ చేరుకున్నారు.
అప్పటికే అక్కడికి మోదీ సహా, ఇతర కేబినెట్ మంత్రులు చేరుకోగా, బడ్జెట్ ను కేబినెట్ ముందుంచి, ఆమోదం తీసుకున్నారు. ఆ వెంటనే 2021-22 వార్షిక బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్టు ప్రకటన వెలువడింది. మరికాసేపట్లో ఆమె లోక్ సభలో బడ్జెట్ వివరాలను వెల్లడించనున్నారు.