ఏపీ బీజేపీ నాయకురాలు సాదినేని యామినికి కీలక పదవి
- టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు
- అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీలో చేరిన యామిని
- నియామకపత్రాన్ని విడుదల చేసిన బీజేపీ
ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించి, గతేడాది బీజేపీలో చేరిన సాదినేని యామినికి ఆ పార్టీ కీలక పదవిని అప్పగించింది. ఆమెను బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్టు రాష్ట్ర విభాగం అధ్యక్షురాలు నిర్మలా కిశోర్ నిన్న ప్రకటించారు. ఈ మేరకు నియామక పత్రం విడుదల చేశారు. యామిని టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత గతేడాది జనవరిలో బీజేపీలో చేరారు. ఏపీలో ఇటీవల హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను నిరసిస్తూ ఆందోళనల్లో పాల్గొన్నారు.