తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ!
- గత మూడు రోజులుగా భక్తుల రద్దీ
- నిన్న దాదాపు 48 వేల మందికి దర్శనం
- హుండీ ద్వారా రూ. 2.80 కోట్ల ఆదాయం
శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వారాంతం కావడంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకూ నిత్యమూ సగటున 50 వేల మంది వరకూ స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న ఆదివారం నాడు 48 వేల మందికి పైగా భక్తులకు స్వామి దర్శనం లభించిందని పేర్కొన్నారు. 17,845 మంది తలనీలాలు సమర్పించారని, ఈ ఉదయం స్వామి దర్శనానికి 9 వేల మంది వరకూ నిరీక్షిస్తున్నారని తెలిపారు. ఆదివారం హుండీ ఆదాయం 2.80 కోట్ల వరకూ వచ్చిందని అన్నారు.