జీఎస్టీ కొత్త రికార్డ్... జనవరి మాసం వసూళ్లు ఇవిగో!

  • జనవరిలో 1.19 లక్షల కోట్లు వసూలు
  • డిసెంబరు నాటి రూ.1.15 లక్షల కోట్ల వసూళ్ల రికార్డు తెరమరుగు
  • గత జనవరితో పోల్చితే 8 శాతం అధికం
  • గతేడాది జనవరిలో రూ.1.11 లక్షల కోట్లు వసూలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ పన్నుల విధానంలో వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ జనవరిలో రికార్డు స్థాయిలో అత్యధికంగా రూ.1.19,847 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. ఇందులో సీజీఎస్టీ రూ.21,923 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ రూ.29,014 కోట్లు, ఐజీఎస్టీ రూ.60,288 కోట్లు వసూలయ్యాయి. సెస్ ల రూపేణా మరో రూ.8,622 కోట్లు వసూలయ్యాయి.

2020 జనవరి వసూళ్లతో పోలిస్తే ఇది 8 శాతం అధికం అని చెప్పాలి. గతేడాది రూ.1.11 లక్షల కోట్ల మేర జీఎస్టీ రాబడి నమోదైంది. గత డిసెంబరులో రూ.1.15 లక్షల వసూళ్లే ఇప్పటివరకు రికార్డు అని భావించగా, జనవరి వసూళ్లు ఆ రికార్డును చెరిపివేశాయి. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక ఈ స్థాయిలో వసూళ్లు ఇదే ప్రథమం.


More Telugu News