రేషన్ అందించే వాహనాలపై రాజకీయ నేతల ఫొటోలు, గుర్తులు వద్దు: హైకోర్టు కీలక ఆదేశాలు

  • రేషన్ పంపిణీకి అనుమతి కోరుతూ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్
  • అనుమతించిన హైకోర్టు
  • కార్యక్రమ వివరాలతో ఎస్‌ఈసీని సంప్రదించాలని ఆదేశం
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో ఫిబ్రవరి నుంచి ఇంటింటికీ రేషన్‌ సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుకట్ట పడింది. ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీకి అనుమతి కోరుతూ హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల నిబంధనలకు లోబడి వాహనాల ద్వారా రేషన్‌ను పంపిణీ చేసుకోవచ్చని సూచించింది. అయితే, ఆ వాహనాలపై రాజకీయ నేతల ఫొటోలు కానీ, పార్టీ గుర్తులు,  పార్టీ రంగులు కానీ ఉండరాదని ఆదేశించింది. కార్యక్రమ వివరాలతో రెండు రోజుల్లో ఎస్‌ఈసీని సంప్రదించాలని సూచించింది. ఎన్నికల కమిషన్ ఆ తరువాత ఐదు రోజుల్లో తన నిర్ణయం తెలపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


More Telugu News