అన్ని స్థానాల్లోనూ నామినేషన్లు వేయండి: చంద్రబాబు కీలక సూచనలు
- బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలి
- కేసులు, కిడ్నాప్‌లతో భయపెట్టాలని చూస్తే సహించబోం
- కక్షలు తీర్చుకోవడానికి వేదికగా గ్రామాలను వైసీపీ మార్చేసింది
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో నామినేషన్లు వేయాలని చెప్పారు.
బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని చెప్పారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎదురవుతోన్న ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. తాము బలపర్చుతోన్న అభ్యర్థుల విషయంలో బెండోవర్ కేసులు, కిడ్నాప్‌లతో భయపెట్టాలని చూస్తే సహించబోమని తెలిపారు.
కక్షలు తీర్చుకోవడానికి వేదికగా గ్రామాలను వైసీపీ మార్చేసిందని చెప్పారు. వాలంటీర్ల ద్వారా వైసీపీ నేతలు ప్రలోభాలకు గురి చేసే చర్యలను ఎక్కడికక్కడ తిప్పికొడుతూ ఫిర్యాదులు చేయాలని చంద్రబాబు సూచించారు.