అంబేద్కర్ గారిని అవమానిస్తుంది వైకాపా ప్రభుత్వం: లోకేశ్
- పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఘటన
- అంబేద్కర్ గారి విగ్రహానికి దుండగులు చెప్పుల దండ
- ఈ చర్యకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ అంబేద్కర్‌ను ప్రభుత్వం అవమానిస్తోందని ఆయన చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహం వద్ద కొందరు దుశ్చర్యకు పాల్పడ్డారని ఆయన తెలిపారు.
'125 అడుగుల ఎత్తులో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు 20 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చెయ్యడానికి ప్రణాళిక సిద్ధం చేసింది నాటి టీడీపీ ప్రభుత్వం. నేడు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ ప్రతినిత్యం అంబేద్కర్ గారిని అవమానిస్తుంది వైకాపా ప్రభుత్వం' అని లోకేశ్ తెలిపారు.
'పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో బడుగు, బలహీన వర్గాలకు స్వేచ్ఛా వాయువులు పంచిన అంబేద్కర్ గారి విగ్రహానికి దుండగులు చెప్పుల దండ వేసి అవమానించారు. ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ చర్యకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి' అని లోకేశ్ ట్వీట్లు చేశారు.