గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాకు అవమానం జరిగింది: ప్రధాని మోదీ
- రైతుల ఆందోళనలపై మోదీ కీలక వ్యాఖ్య
- జెండాకు అవమానం వల్ల దేశం విచారం వ్యక్తం చేసిందన్న మోదీ
- భారత్‌లో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోందన్న ప్రధాని
కేంద్ర తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున రైతులు నిరసన ప్రదర్శనలు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎర్రకోటపై కూడా వారు కొన్ని జెండాలను ఎగురవేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ దీనిపై స్పందించారు. గణతంత్ర దినోత్సవం నాడు మూడు రంగుల జెండాకు జరిగిన అవమానంపై భారత్ విచారం వ్యక్తం చేసిందని చెప్పారు.
కాగా, కరోనాను కట్టడి చేయడం కోసం దేశంలో చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి మోదీ మాట్లాడుతూ... ప్రపంచంలోని ఇతర దేశాలకంటే వేగంగా భారత్‌లో ఈ కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. భారత్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోందని తెలిపారు.
దేశంలో కేవలం 15 రోజుల్లో 30 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్లు వేశామని తెలిపారు. ఇంత మందికి వ్యాక్సిన్లు వేయడానికి అమెరికా వంటి అగ్రదేశానికి 18 రోజులు, బ్రిటన్‌కు 36 రోజులు పట్టిందని చెప్పారు. మేడిన్ ఇండియాలో భాగంగా చేపట్టిన వ్యాక్సిన్ భారత్ ఆత్మ నిర్భరతకు ప్రతీక అని చెప్పారు.