మూడు రోజుల పాటు చిన్నారుల‌కు పోలియో చుక్క‌ల కార్య‌క్ర‌మం.. ఇరు రాష్ట్రాల్లో ప్రారంభం

  • ఏపీలోని ప‌లు కేంద్రాల్లో ప్రారంభించిన‌ ప్ర‌జాప్ర‌తినిధులు
  • తెలంగాణలో మొత్తం 38,31,907 మంది చిన్నారులకు పోలియో చుక్క‌లు
  • 23,331 కేంద్రాల ఏర్పాటు  
ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ప‌ల్స్‌పోలియో కార్య‌క్ర‌మం ఈ రోజు ఉద‌యం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో మాత్రం ఈ కార్య‌క్ర‌మం వ‌చ్చేనెల‌ 3 వరకు జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో, తెలంగాణలోని 33 జిల్లాల్లో చిన్నారుల‌కు పోలియో చుక్క‌లు వేస్తున్నారు.

ఏపీలోని ప‌లు కేంద్రాల్లో ప్ర‌జాప్ర‌తినిధులు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంలోని కోసురువారిపాలెంలో చిన్నారులకు పోలియో చుక్క‌లు వేశారు. అలాగే, పశ్చిమగోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘ కార్యాలయంలో, కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో పోలియో చుక్క‌లు వేయించుకోవ‌డం కోసం చిన్నారుల‌ను త‌ల్లిదండ్రులు భారీ సంఖ్య‌లో తీసుకొచ్చారు.

మ‌రోవైపు, తెలంగాణలో మొత్తం 38,31,907 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్క‌లు వేసే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. తెలంగాణ‌లో మొత్తం 23,331 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప‌లు జిల్లాల్లో మంత్రులు పోలియో చుక్క‌లు వేసే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.




More Telugu News