తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్న టీమిండియా క్రికెటర్ నటరాజన్

  • ఐపీఎల్‌లో ప్రతిభ చాటి టీమిండియాలో చోటు దక్కించుకున్న నటరాజన్
  • ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారథ్యం
  • సెల్ఫీలు తీసుకున్న అభిమానులు
తమిళనాడుకు చెందిన టీమిండియా క్రికెటర్ టి. నటరాజన్ నిన్న దిండుగల్ జిల్లా పళనిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నాడు. తలనీలాలు సమర్పించాడు. విషయం తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని నటరాజన్‌తో సెల్ఫీలు దిగారు. గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహించిన నటరాజన్‌ సత్తాచాటాడు.

ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవకాశం లభించింది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో టీ20, వన్డే, టెస్టుల్లో ఆడి ప్రతిభ చాటాడు. ఆసీస్ పర్యటన ముగించుకుని ఇటీవల స్వగ్రామం చిన్నపంపట్టి చేరుకున్న నటరాజన్‌కు ఘన స్వాగతం లభించింది.


More Telugu News