శ‌శిక‌ళ కోలుకున్నారు.. రేపు డిశ్చార్జి చేస్తాం: ఆసుప‌త్రి ప్ర‌క‌ట‌న

  • అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన శశికళ
  • కొన్ని రోజులుగా ఆసుప‌త్రిలోనే చికిత్స‌
  • శశికళకు పదిరోజుల చికిత్స పూర్తయింది 
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ ప్ర‌స్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విష‌యం తెలిసిందే. ఆమె శిక్షా కాలం ముగియ‌డంతో ఇటీవ‌లే ఆమె విడుదలయ్యారు. శ‌శిక‌ళ‌ ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉండ‌డంతో ఆమె ఆసుప‌త్రి నుంచి రేపు డిశ్చార్జి కానున్నారు.

బెంగ‌ళూరు వైద్య కళాశాల ఆసుప‌త్రి విడుద‌ల‌ చేసిన  తాజా హెల్త్‌ బులిటెన్‌లో ఈ విష‌యాన్ని వెల్లడించింది.  శశికళకు పదిరోజుల చికిత్స పూర్తయిందని పేర్కొంది. ఆమెకు ఎలాంటి క‌రోనా‌ లక్షణాలు లేవని, మూడు రోజులుగా ఆక్సిజన్‌ లేకుండా శ్వాస తీసుకోగలుగుతున్నారని తెలిపింది.

దీంతో ఆమె ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి కావ‌చ్చ‌ని, ఆమె రేపు విడుదల కానున్నారని అందులో పేర్కొంది. త్వ‌ర‌లో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆమె విడుద‌లవుతుండ‌డంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారే అవ‌కాశాలున్నాయి.


More Telugu News