నిమ్మగడ్డ రమేశ్ పై ఈ ప్రభుత్వం కత్తికట్టింది: వర్ల రామయ్య

  • రాష్ట్ర మంత్రులు నిమ్మగడ్డపై అమానుషంగా మాట్లాడుతున్నారు
  • ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగకూడదని ప్రభుత్వం అనుకున్నట్టుంది
  • రాష్ట్రంలో రాజ్యాంగ అమలు ప్రశ్నార్థకంగా మారింది
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల విషయంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఈమేరకు ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిమ్మగడ్డ రమేశ్ పై వైసీపీ ప్రభుత్వం కత్తికట్టిందని వర్ల అన్నారు. రాష్ట్ర మంత్రులు ఆయనపై అమానుషంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనను వ్యక్తిగతంగా బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగకూడదని ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నట్టుగా ఉందని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. బలవంతంగా ఏకగ్రీవాలను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమా? అని ప్రశ్నించారు.


More Telugu News