ప్రపంచంలోనే తొలి కరోనా కేసు నమోదైన ఆసుపత్రికి డబ్ల్యూహెచ్ వో బృందం
- 14 రోజుల క్వారంటైన్ తర్వాత తొలిసారి క్షేత్ర సందర్శన
- అంతకుముందే హోటల్ లో చైనా అధికారులతో భేటీ
- ఇన్నాళ్లూ వీడియో మీటింగ్ ల ద్వారానే ఆరా
14 రోజుల క్వారంటైన్ అనంతరం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఉన్నతాధికారులు చైనాలో కరోనా వైరస్ పై దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా శుక్రవారం అక్కడ మొదటి కరోనా కేసు నమోదైన వుహాన్ లోని హ్యూబెయ్ ప్రావిన్షియల్ హాస్పిటల్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ చైనీస్ అండ్ వెస్టర్న్ మెడిసిన్ కు వెళ్లారు. 2019 డిసెంబర్ 27న ఆ ఆస్పత్రిలోనే ‘గుర్తు తెలియని న్యుమోనియా’గా ఆ కేసును రికార్డ్ చేశారు.
అక్కడికి సమీపంలోని హోటల్ లోనే ఇన్నాళ్లూ అధికారులు బస చేశారు. ఇన్ని రోజులు చైనా అధికారులతో వీడియో సమావేశాల ద్వారా కరోనా వ్యాప్తిపై ఆరా తీశారు. క్వారంటైన్ పూర్తయిన తర్వాత వారిని హోటల్ కు పిలిపించుకుని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డచ్ వైరాలజిస్ట్ మేరియన్ కూప్ మన్స్ శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు.
‘‘మొదటి ముఖాముఖి సమావేశం. సవరణ: ఆంక్షల నేపథ్యంలో ఫేస్ మాస్క్ టు ఫేస్ మాస్క్ మీటింగ్’’ అంటూ సరదాగా ట్వీట్ చేశారు. చైనా టీమ్ లీడర్ ప్రొఫెసర్ లియాంగ్ వనియన్ తో క్షేత్ర సందర్శనలపై చర్చించామన్నారు. 14 రోజుల జూమ్ మీటింగ్స్ తర్వాత ఇప్పుడు కలవడం సంతోషంగా ఉందన్నారు.