వచ్చేనెల మొదటి వారం నుంచి ముందు వరుస ఉద్యోగులకూ కరోనా వ్యాక్సిన్

  • రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు
  • ఆయా రాష్ట్రాలకు డోసులను కేటాయించామని వెల్లడి
  • త్వరలోనే సరఫరా చేస్తామని చెప్పిన కేంద్రం
  • కొవిన్ డేటా ప్రకారం 61 లక్షల మంది ఉద్యోగులు
ముందు వరుస కరోనా ఉద్యోగులకూ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కరోనా టీకాను వేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నానీ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.

ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ వేస్తూనే ముందు వరుస ఉద్యోగులకూ టీకాలు వేయాలని లేఖలో పేర్కొన్నారు. వారికి సంబంధించిన వివరాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు డేటాబేస్ లో పొందుపరుస్తున్నారని, ఆ కార్యక్రమం పూర్తి కావొచ్చిందని చెప్పారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకూ సరిపడా కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసులను కేటాయించామని, త్వరలోనే వాటిని సరఫరా చేస్తామని చెప్పారు.

కాగా, ఇప్పటిదాకా కొవిన్ వెబ్ సైట్, సాఫ్ట్ వేర్ లో అప్ డేట్ చేసిన సమాచారం ప్రకారం దాదాపు 61 లక్షల మంది ముందు వరుస ఉద్యోగులున్నట్టు సమాచారం. మొత్తంగా శుక్రవారం నాటికి 29 లక్షల 28 వేల 53 మందికి కరోనా టీకాలు వేశారు.


More Telugu News