కర్ణాటక విధాన పరిషత్ లో అశ్లీల వీడియోలు వీక్షిస్తూ దొరికిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ
- సభలో వీడియోల వీక్షణలో మునిగిన ప్రకాశ్ రాథోడ్
- చిత్రీకరించిన టీవీ చానల్ విలేకరి
- గతంలోనూ దొరికిన ముగ్గురు బీజేపీ మంత్రులు
కర్ణాటక విధాన పరిషత్ సమావేశంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తన ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోయారు. నిన్న విధాన పరిషత్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ పాల్గొన్నారు. అయితే, ఆయన సమావేశాలను పట్టించుకోకుండా సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూడడంలో మునిగిపోయారు. ఓ టీవీ చానల్ కెమెరా దానిని చిత్రీకరించడంతో విషయం వెలుగు చూసింది.
విషయం బయటకు రావడంతో దుమారం రేగింది. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే, చట్టసభల్లో ఇలా అభ్యంతరకర వీడియోలు చూస్తూ సభ్యులు దొరికిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2012లో ముగ్గురు బీజేపీ మంత్రులు లక్ష్మణ సావాడి, సీసీపాటిల్, కృష్ణ పాలేమర్ ఇలానే అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయారు.
ఈ ఘటన తర్వాత అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధించారు. కాగా, అశ్లీల వీడియోల దుమారంపై ప్రకాశ్ రాథోడ్ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో తాను అడిగిన ప్రశ్నకు సంబంధించిన సందేశాలను ఓ మంత్రికి అందజేసేందుకు సెల్‌ఫోన్‌లో వెతికానని, ఈ క్రమంలో స్టోరేజీ ఫుల్ కావడంతో అక్కర్లేని వీడియోలను తొలగించానని వివరణ ఇచ్చారు.