130 ఏళ్ల తర్వాత తొలిసారి అమెరికాలో కనిపించిన మంచు గుడ్లగూబ!
- చివరిసారి 1890లో కనిపించిన మంచు గుడ్లగూబ
- సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన వైనం
- జూకు పోటెత్తిన పక్షిప్రేమికులు
ఎప్పుడో 1890 ప్రాంతంలో అమెరికాలో కనిపించిన మంచు గుడ్లగూబ మళ్లీ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ జూలో ఇది కనిపించిన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ అరుదైన మంచు గుడ్లగూబను చూసేందుకు పక్షిప్రేమికులు, ఔత్సాహికులు పోటెత్తారు. ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. దీంతో అప్రమత్తమైన పార్క్ అధికారులు దానిని భయపెట్టవద్దని, దూరంగా ఉండాలని సూచించారు. గుడ్లగూబను చూసేందుకు బైనాక్యులర్లు ఉపయోగించాలని సూచించారు.
మంచు గుడ్లగూబ సెంట్రల్ పార్క్‌లో 1890లో చివరిసారి కనిపించిందని, మళ్లీ 130 ఏళ్ల తర్వాత ఇప్పుడు దర్శనమిచ్చిందని అమెరికాలోని నేచురల్ హిస్టరీ మ్యూజియం పక్షిశాస్త్ర విభాగ కలెక్షన్ మేనేజర్ పాల్ స్వీట్ తెలిపారు. ఇవి ఆర్కిటిక్ ప్రాంతంలోని టండ్రాల్లో నివసిస్తుంటాయని, శీతాకాలంలో మాత్రం దక్షిణ దిశగా ప్రయాణిస్తాయని పేర్కొన్నారు.