సాగునీటి ప్రాజెక్టులపై జగన్ సమీక్ష.. పోలవరాన్ని సకాలంలో పూర్తిచేయాలని ఆదేశం

సాగునీటి ప్రాజెక్టులపై జగన్ సమీక్ష.. పోలవరాన్ని సకాలంలో పూర్తిచేయాలని ఆదేశం
  • కాఫర్ డ్యాం వల్ల ముంపునకు గురికాకుండా చూడాలన్న జగన్
  • సహాయ, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని ఆదేశం
  • జులై నాటికి వంశధార పెండింగ్ పనులు పూర్తవుతాయన్న అధికారులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై నిన్న అధికారులతో సమీక్షించారు. నిర్ణీత లక్ష్యం లోగా ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాల్సిందేనన్నారు. కాఫర్ డ్యాం వల్ల ముంపునకు గురికాకుండా చూడాలని, సహాయ, పునరావాస చర్యలు వేగవంతం చేయాలన్నారు.

స్పందించిన అధికారులు వంశధార-నాగావళి అనుసంధాన పనులతోపాటు వంశధార పెండింగ్ పనులను జులై నాటికి పూర్తి చేస్తామని సీఎంకు తెలిపారు. రాయలసీమ, పల్నాడు ప్రాజెక్టులకు ఆయా ఆర్థిక సంస్థలతో అంగీకారం కుదిరిందని, మిగిలిన ప్రాజెక్టులకు కూడా నిధుల సమీకరణపై దృష్టి సారించినట్టు అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు.


More Telugu News