తన కరోనా వ్యాక్సిన్ సమర్థతపై వివరాలు తెలిపిన జాన్సన్ అండ్ జాన్సన్

  • సింగిల్ డోస్ వ్యాక్సిన్ తయారుచేసిన జాన్సన్ అండ్ జాన్సన్
  • ఓవరాల్ గా 66 శాతం సమర్థంగా పనిచేస్తోందని వెల్లడి
  • 44 వేల మంది వలంటీర్లపై ప్రయోగం
  • అత్యధికంగా అమెరికాలో 72 శాతం సమర్థత
ఈ ప్రపంచం నుంచి కరోనా వైరస్ ను నిర్మూలించే ఉద్దేశంతో దిగ్గజ ఫార్మా సంస్థలన్నీ వ్యాక్సిన్ అభివృద్ధి బాట పట్టాయి. ఇప్పటికే అనేక సంస్థలకు చెందిన వ్యాక్సిన్లు కీలక దశలు అధిగమించి అత్యవసర అనుమతులతో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాకు చెందిన బహుళజాతి ఫార్మా పరిశోధక సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కూడా కరోనా వ్యాక్సిన్ ను రూపొందించింది. ఈ వ్యాక్సిన్ పనితీరుకు సంబంధించిన వివరాలను జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది.

ఇది ప్రధానంగా సింగిల్ డోస్ వ్యాక్సిన్ అని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన క్లినికల్ పరీక్షల ద్వారా 66 శాతం సమర్థతతో పనిచేస్తున్నట్టు వెల్లడైందని పేర్కొంది. అనేక కరోనా రకాలపై దీన్ని ప్రయోగించినట్టు జాన్సన్ అండ్ జాన్సన్ వివరించింది. తమ వ్యాక్సిన్ ను దాదాపు 44 వేల మంది వలంటీర్లపై ప్రయోగించగా,  అమెరికాలో 72 శాతం, లాటిన్ అమెరికా దేశాల్లో 66 శాతం, దక్షిణాఫ్రికాలో 57 శాతం రక్షణ కలుగజేస్తున్నట్టు గుర్తించామని ఓ ప్రకటనలో తెలిపింది.


More Telugu News