ఏసీబీ కోర్టులో రేవంత్ రెడ్డికి చుక్కెదురు
- ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ
- ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదన్న రేవంత్ రెడ్డి
- ఇది ఎన్నికల సంఘానికి చెందిన కేసు అంటూ పిటిషన్
- రేవంత్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు
- ఈ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధి కిందకు వస్తుందని వెల్లడి
గతంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్ రెడ్డిపై బలమైన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని, ఈ కేసు ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు.
ఇవాళ ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏసీబీ న్యాయస్థానం రేవంత్ రెడ్డి అభ్యర్థన చెల్లదని స్పష్టం చేసింది. ఆ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ వ్యవహారం అవినీతి నిరోధక చట్టం పరిధిలోకే వస్తుందని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. అప్పట్లోగా అభియోగాల నమోదు చేయాలని ఆదేశించింది. ఫిబ్రవరి 8న జరిగే విచారణకు నిందితులు హాజరవ్వాలని స్పష్టం చేసింది.
ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి వచ్చిన సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్ లో చేరి మల్కాజ్ గిరి ఎంపీగా ఎన్నికయ్యారు.