ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్!

  • 28.30 లక్షల ఇళ్లను నిర్మించనున్న ఏపీ ప్రభుత్వం
  • టెండర్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ
  • టెండరింగ్ లో రివర్స్ టెండరింగ్ పద్ధతిని పాటించాలని ఆదేశాలు
ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం వైయస్సార్ జగనన్న కాలనీల నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా 10 మంది సభ్యులతో టెండర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

కమిటీకి వైస్ ఛైర్మన్ గా జాయింట్ కలెక్టర్, మెంబర్ కన్వీనర్ గా గృహ నిర్మాణ జిల్లా స్థాయి అధికారి, సభ్యులుగా పరిశ్రమలు, గ్రామీణ నీటి సరఫరా, ఆర్ అండ్ బీ, విద్యుత్, పంచాయతీ రాజ్, కార్మిక శాఖ, గనుల శాఖ జిల్లా స్థాయి అధికారులు వుంటారు. టెండరింగ్ ప్రక్రియలో రివర్స్ టెండరింగ్ పద్ధతిని పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.  


More Telugu News