మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
- మర్రిమిట్ట వద్ద ఆటో, లారీ ఢీ
- నుజ్జునుజ్జయిన ఆటో
- శుభకార్యానికి వెళుతుండగా ఘటన
- ఆరుగురి మృతి
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం
మహబూబాబాద్ జిల్లాలో రహదారి రక్తసిక్తమైంది. గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. లారీ, ఆటో ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు.
ఇక ప్రమాదంలో చనిపోయిన వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారని, వరంగల్ లో ఓ శుభకార్యానికి ఆటోలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కూడా కన్నుమూశాడు. ఆటో నుజ్జునుజ్జవడం ప్రమాద తీవ్రతను వెల్లడిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కాగా, ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు.