ఆసుపత్రిలో చొరబడి లేడీ డాక్టర్ ను కాల్చి చంపిన భారతీయ అమెరికన్ వైద్యుడు!
- క్యాన్సర్ బారినపడిన డాక్టర్ భరత్ నారుమంచి
- ఓ వైద్య సంస్థలో వలంటీర్ గా పనిచేసేందుకు దరఖాస్తు
- తిరస్కరణకు గురైన దరఖాస్తు
- తుపాకీతో భయోత్పాతం
అమెరికాలో ఓ భారతీయ అమెరికన్ వైద్యుడు ఆసుపత్రిలో చొరబడి వైద్యురాలిని కాల్చి చంపి, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. టెక్సాస్ రాజధాని ఆస్టిన్ లో ఈ ఘటన జరిగింది. ఆ భారతీయ అమెరికన్ వైద్యుడి పేరు భరత్ నారుమంచి. 43 ఏళ్ల భరత్ చిన్నపిల్లల వైద్యుడు. అయితే, భరత్ ప్రాణాంతక క్యాన్సర్ బారినపడ్డాడు. అతడు జీవితం చివరి దశలో ఉన్నాడు. మరికొన్ని వారాలకు మించి బతికే అవకాశాలు లేవని డాక్టర్లు చెప్పారు.
అయితే, భరత్ ఇటీవల చిల్డ్రన్ మెడికల్ గ్రూప్ అనే బాలల వైద్య సేవల సంస్థలో స్వచ్ఛందంగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోగా, అతడి దరఖాస్తును అధికారులు అంగీకరించలేదు. ఈ క్రమంలో, భరత్ తుపాకీ చేతబూని ఆ మెడికల్ గ్రూప్ కేంద్రంలో ప్రవేశించి కొందరిని బందీలుగా పట్టుకున్నాడు. వారిలో కొందరు తప్పించుకోగా, క్యాథరిన్ లిండ్లే డాడ్సన్ అనే లేడీ డాక్టర్ ను భరత్ కాల్చి చంపాడు. ఆపై తాను కూడా కాల్చుకుని ప్రాణాలు విడిచాడు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, భరత్ నారుమంచి తల్లిదండ్రులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు జరిగిందో తెలియడంలేదని, పోలీసుల దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.