కాశీ అన్నపూర్ణా దేవి ఆలయంలో శోభ, కవిత, శైలిమ ప్రత్యేక పూజలు!
- రెండో రోజు కొనసాగుతున్న వారణాసి పర్యటన
- సౌకర్యాలు కల్పించిన స్థానిక అధికారులు
- నేడు కాశీ విశ్వేశ్వరుడు, దుందిరాజ్ గణేశ్ సందర్శన
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులు నేడు వరుసగా రెండో రోజు వారణాసిలో పర్యటిస్తున్నారు. నిన్న వారణాసి చేరుకున్న కేసీఆర్ సతీమణి శోభ, వారి కుమార్తె కవిత, కేటీఆర్ భార్య శైలిమలకు స్థానిక అధికారులు ప్రొటోకాల్ ఏర్పాట్లు చేసి, వారి పర్యటనకు సౌకర్యాలు కల్పించారు. నిన్న గంగా హారతి, నదీమతల్లికి పూజలు నిర్వహించిన వారు, కాశీలోని పురాతన సంకటమోచన హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఇక నేటి ఉదయం కాశీ విశ్వేశ్వరాలయాన్ని దర్శించుకున్న వీరంతా, అన్నపూర్ణాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శైలిమ, శోభ, కవితలు కుంకుమపూజలో పాల్గొన్నారు. ఆపై దుందిరాజ్ ఆలయంలోని కోరికలు తీర్చే దేవుడిగా పేరున్న వినాయకుని దర్శించుకుని పూజించారు. వరాహి ఆలయానికి కూడా వీరంతా వెళ్లారు. నేటితో వీరి పర్యటన ముగియనుంది.